మెట్పల్లి: మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మైసమ్మ పండుగ

మెట్పల్లి పట్టణ మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం మైసమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో మున్సిపల్ చైర్మన్ మైలారం లింబాద్రి, జువ్వాడి నర్సింగరావు ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. డప్పు చప్పుళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలతో మున్సిపల్ కార్యాలయ పరిసరాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా ఆఫీస్ సిబ్బంది, కార్మికులు కులమతాలకు అతీతంగా కలిసికట్టుగా వేడుకలు జరుపుకోవడం విశేషం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్