మెట్‌పల్లి పట్టణంలో శుక్రవారం లయన్ క్లబ్ వారి ఆధ్వర్యంలో వరల్డ్ పాపులేషన్ డే సందర్బంగా సాహితి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ లో కుటుంబ నియంత్రణ, దాని ఆవశ్యకత గురించి అవగాహన కార్యక్రమం జరిగింది. అనంతరం అధ్యక్షులు వెలుమల శ్రీనివాస్ రావు మాట్లాడుతూ చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని కుటుంబ నియంత్రణ వల్ల ఎంతో మేలు జరుగుతుందని, కుటుంబ నియంత్రణ లేని కుటుంబాలు దిగువ స్థాయిలో ఉంటున్నారని దీనిపై అవగాహన చేసుకోవాలని అన్నారు.