కోరుట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం (NSS) దినోత్సవాన్ని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాజకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థుల్లో సేవాభావం, సామాజిక బాధ్యతను పెంపొందించడంలో NSS పాత్రను వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు జాతీయ సేవా పథకం లక్ష్యాలు, సమాజ సేవ యొక్క ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, NSS విద్యార్థులు పాల్గొన్నారు.