రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఉన్నత విద్యా ప్రమాణాలను పెంచేందుకు అప్రెంటీస్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రాం (AEDP)ను రానున్న విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనుంది. దీని ద్వారా విద్యార్థులు పరిశ్రమలతో అనుసంధానమై, ప్రాక్టికల్స్, ప్రాజెక్ట్ వర్క్, ఇంటర్న్‌షిప్‌లకు ప్రాధాన్యత ఇస్తారు. కోరుట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో B.Com. విభాగంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (AEDP) కోర్సును ప్రవేశపెట్టారు. ప్రిన్సిపాల్ నడికట్ల సందీప్ మాట్లాడుతూ, ఈ విధానం విద్యార్థుల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుందని, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందని తెలిపారు.