జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో ఆదివారం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గ్రామదేవత పోచమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించారు. బోయవాడ నుంచి గొల్లెండ్లు, డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా అమ్మవారి దేవాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, గ్రామ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఉత్సవ నిర్వాహకులు తెలిపారు.