ఘనంగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు

జగిత్యాల జిల్లా, కోరుట్లలోని కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో శుక్రవారం భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకుడు, ఏకాత్మ మానవ వాదం, అంత్యోదయ సిద్ధాంత కర్త పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ 110వ జయంతి వేడుకలను బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధారి శ్రీనివాస్, కాసోజి ప్రశాంత్, రాజు, కాసోజి ప్రతాప్, చింతకుంట రవి, ఎల్ల వినోద్, నవీన్, లింగేశ్వర్, మారుతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕