గుంతలమయమైన ఎకిన్‌పూర్ ప్రధాన రహదారి

జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీ 6వ వార్డు ఎకిన్‌పూర్‌లోని ప్రధాన రహదారి వర్షం కురిస్తే మట్టి చెరువుగా మారుతోంది. గుంతల్లో నీరు నిలిచి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు, వృద్ధులు, మహిళల రాకపోకలకు అవస్థలు పడుతుండగా, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంది. పాలకులు, అధికారులు మారినా రోడ్ల పరిస్థితి మారలేదని, అభివృద్ధి మాటల్లో కాకుండా రోడ్లపై కనిపించాలని ప్రజలు కోరుతున్నారు. కోరుట్ల మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి రహదారిని పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕