జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్‌రావుపేట గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి కోసం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నిధుల నుంచి రూ. 3 లక్షలు మంజూరు అయ్యాయి. ఈ నిధులకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ వై. అనూప్ రావు, బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు ఆలయ కమిటీ సభ్యులకు, గ్రామస్తులకు అందజేశారు. ఆలయాల పరిరక్షణే లక్ష్యంగా ఎంపీ నిధులను వినియోగిస్తున్నామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.