జగిత్యాల కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఖుతుబోద్దీన్ పాషా నియామకం

జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మెట్‌పల్లికి చెందిన మైనారిటీ నాయకుడు మహమ్మద్ ఖుతుబోద్దీన్ పాషా నియామకం అయ్యారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజంగి నందయ్య ఉత్తర్వులు జారీ చేశారు. టిపిసిసి డెలిగేట్ మెంబర్ సుజిత్ రావు నేతృత్వంలో కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. పాషాకు నియామక ఉత్తర్వులు అందజేశారు. రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండే పాషా జిల్లా స్థాయి పదవిని కైవసం చేసుకోవడం పట్ల నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕