కోరుట్ల: అరుణాచల గిరిప్రదక్షిణకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు

గురు పౌర్ణమిని పురస్కరించుకొని అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తుల కోరిక మేరకు కోరుట్ల డిపో నుండి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశామని డిపో మేనేజర్ మనోహర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపినారు. ఈ బస్సు 8వ తేదీన సాయంత్రం 4గ" కోరుట్ల నుండి బయలుదేరి కరీంనగర్, హైదరాబాద్ వెళ్ళి 9వ తేదీన కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసుకొని అనంతరం 10వ తేదీన ఉదయం అరుణాచలం చేరుకొని అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేసి దర్శనం అనంతరం అదే రోజు రాత్రి బయలుదేరి 11వ తేదీన గద్వాల జోగులాంబ అమ్మవారిని దర్శనం చేసుకొని సాయంత్రం వరకు కోరుట్లకి తిరిగి వచ్చును. గిరి ప్రదక్షీణ టూర్ ప్యాకేజీ ధర పెద్దలకు రూ 5000, పిల్లలకి రూ 3800 గా సంస్థ నిర్ణయించింది. 
మరిన్ని వివరాలకు 7989235379,9963961503,9440485576 నెంబర్లను సంప్రదించగలరు.

సంబంధిత పోస్ట్