సునేత్ర పవార్ నేడు డిప్యూటీ సీఎంగా ప్రమాణం

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నేడు సునేత్ర పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించడంతో ఈ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ఎన్సీపీ అజిత్ వర్గం ప్రతిపాదనను సునేత్ర అంగీకరించారు. మధ్యాహ్నం ఎన్సీపీ శాసనసభాపక్ష సమావేశంలో సునేత్రను శాసనసభాపక్షనేతగా ఎన్నుకోనున్నారు. సాయంత్రం ముంబై లోక్‌భవన్‌లో ప్రమాణస్వీకారం జరగనుంది. సునేత్రకు ఎక్సైజ్, క్రీడా శాఖలు దక్కే అవకాశం ఉంది. బారామతి ఉపఎన్నికలో ఆమె పోటీ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్