జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో బుధవారం వినాయక నిమజ్జన వేడుకలు ప్రారంభమయ్యాయి. డీఎస్పీ, సీఐ, ఎస్ఐల పర్యవేక్షణలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్ అధికారులు నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. సంప్రదాయ ప్రదర్శనలు, కళాకారుల ప్రదర్శనలు, డోలు వాయిద్యాలు, భక్తి గీతాలతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. వినాయక శోభాయాత్రను చూడటానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.