AP: కాకినాడలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. చిన్నారి కనిపించకుండా పోయిన రోజు సీసీ కెమెరాలో రికార్డైన కియా కారుపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నర్సీపట్నంలో అదే కారు తమను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయిందని, ఆ కారు అనుమానాస్పదంగా తిరుగుతోందని చిన్నారి బంధువులు చెబుతున్నారు. ఈ కారుకు చిన్నారి మిస్సింగ్‌తో సంబంధం ఉందని కుటుంబసభ్యుల అనుమానం.