రాజస్థాన్ జైపుర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మరణించారు. మద్యం మత్తులో ఉన్న డంపర్ ట్రక్ డ్రైవర్ పలు వాహనాలను, రోడ్డుపై వెళ్తున్న వారిని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 50 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.