యూరప్ దేశాలు ఇండియాపై దాడులకు ఆయుధాలు అందిస్తున్నాయని, కానీ ఇండియా యూరప్‌పై దాడులకు ఆయుధాలు అందించడం లేదని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ విమర్శించారు. ఫిన్లాండ్‌లో జరుగుతున్న కుల్టారంటా టాక్స్ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి ఇండియా చమురు కొనుగోలును వెస్టర్న్ కంట్రీస్ వ్యతిరేకిస్తున్నాయని, అయితే యూరప్ దేశాలు తమ అవసరాలకు అనుగుణంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాయని, అందుబాటు ధరలు, లభ్యతను బట్టి ఇండియా కూడా కొనుగోలు చేస్తుందని ఆయన తెలిపారు.