న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశాల సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రష్యా నుంచి ముడిచమురు, సహజ వాయువు కొనుగోలు చేసే దేశాలపై ట్రంప్ ప్రవేశపెట్టిన 'లిండ్సే ఓ గ్రాహమ్ రష్యా, ఇరాన్ ఆంక్షల చట్టం' వల్ల భారత్‌పై పడే ఆర్థిక భారాన్ని జైశంకర్, రూబియో దృష్టికి తీసుకెళ్లారు. ఈ కొత్త చట్టం భారత ప్రయోజనాలను ఎలా దెబ్బతీస్తుందో, దేశానికి ఎలా ప్రతికూలమో ఆయన వివరించారు.