5 ఏళ్లలో తొలిసారి చైనా పర్యటనకు జైశంకర్

విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ త్వరలో చైనా పర్యటనకు వెళ్లనున్నారు. 2020లో గల్వాన్ ఘటనతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన తర్వాత భారత విదేశాంగశాఖ మంత్రి చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. బీజింగ్‌లో చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యితో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. జూలై 14–15లో టియాంజిన్‌లో జరిగే ఎస్‌సీవో సమావేశానికి కూడా హాజరవుతారు. దెబ్బతిన్న సంబంధాలను సరిదిద్దుకునేందుకు భేటీ అవుతున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్