ఉగ్రవాదుల దాడిలో భర్తను కోల్పోయిన నవ వధువు

జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు మరణించారు. అయితే చనిపోయిన ఓ వ్యక్తికి ఇటీవలే పెళ్లైంది. హనీమూన్ కోసం భర్తతో కలిసి వచ్చినట్లు అతడి భార్య తెలిపింది. మాట్లాడుకుంటూ వెళ్తుండగా ఉగ్రవాదులు వచ్చి పాయింట్ బ్లాంక్‌లో షూట్ చేసి చంపారని ఆమె వెల్లడించింది. తన కళ్ల ముందే భర్త చనిపోవడంతో ఆయన మృతదేహం ముందు కూర్చొని బోరున విలపించింది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటో అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

సంబంధిత పోస్ట్