జమ్మూ కశ్మీర్ యువత దేశ సేవకు సైన్యం వైపు పరుగులు (వీడియో)

జమ్మూ కశ్మీర్ యువతలో దేశ సేవ పట్ల అపారమైన ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇండియన్ ఆర్మీకి చెందిన రోమియో ఫోర్స్ ఆధ్వర్యంలో పూంఛ్ జిల్లాలోని సురన్‌కోట్ పట్టణంలో నిర్వహిస్తున్న టెరిటోరియల్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు భారీ స్పందన లభించింది. ఈ నియామక ప్రక్రియలో కేంద్రపాలిత ప్రాంతంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏకంగా 30,000 మందికి పైగా యువత ఉత్సాహంగా పాల్గొంటున్నారు. టెరిటోరియల్ ఆర్మీలో భాగమై దేశ సేవలో పాలుపంచుకోవాలనే ఆకాంక్షతో యువత పెద్ద సంఖ్యలో తరలిరావడం విశేషం.

సంబంధిత పోస్ట్