తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ నటించిన 'జన నాయగన్' సినిమా విడుదల తేదీపై స్పష్టత వచ్చింది. సెన్సార్ వివాదాలు, కోర్టు కేసులు, ఆన్‌లైన్ లీక్‌ల వంటి పలు అడ్డంకులను అధిగమించి, ఈ సినిమాను మే 7 లేదా మే 14వ తేదీలలో విడుదల చేసేందుకు చిత్ర బృందం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో, బుధవారం సెన్సార్ సర్టిఫికెట్ కూడా రానున్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే, ఈ తేదీలలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో విజయ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.