పాట కోసం జానకమ్మ నా కంటే ఎక్కువ కష్టపడేవారు: ఇళయరాజా

ప్రముఖ నేపథ్య గాయని ఎస్.జానకి మరణం తనకు తీరని లోటని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పేర్కొన్నారు. ఆదివారం ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేసిన ఆయన, జానకితో తనకున్న వృత్తిపరమైన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. "జానకమ్మ మరణవార్త విని తీవ్రంగా కలత చెందా. ఇది దిగ్భ్రాంతికరమైన, హృదయవిదారకమైన వార్త. ఆమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు భరించారు. తన గాత్రంతో కోట్లాది మందికి ఆనందం పంచారు. రికార్డింగ్‌ సమయంలో నేను కోరిన భావాన్ని తీసుకురావడానికి ఆమె నా కంటే ఎక్కువ కష్టపడేవారు’ అంటూ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్