అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌కు మరో షాక్ తగిలింది. జానీ మాస్టర్‌ను జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశిస్తూ పత్రిక ప్రకటన విడుదల చేశారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో జనసేన ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కాన్ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్ హెడ్ వేములపాటి అజయ్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు.