బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. వరుణ్ ధావన్‌తో కలిసి నటిస్తున్న కొత్త చిత్రం ‘సన్నీ సంస్కారీ కి తులసి కుమారి’ని ప్రకటించింది. జాన్వీ తులసి కుమారిగా నటిస్తుండగా, శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది.