ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ను జపాన్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. సెకనకు 1.02 పెటాబిట్స్ స్పీడ్‌తో పనిచేసే ఈ ఇంటర్నెట్‌తో కేవలం రెప్ప మూసేలోపే నెట్‌ఫ్లిక్స్ లైబ్రరీలో ఉన్న డేటా మొత్తాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చట. ఒక్క సెకనులోనే వికీపిడియా మొత్తాన్ని 10వేల సార్లు డౌన్‌లోడ్ చేస్తుందట. భారత్‌లోని సగటు ఇంటర్నెట్ స్పీడ్‌తో పోలిస్తే దీని బ్రౌజింగ్, డౌన్‌లోడింగ్ వేగం 16 మిలియన్ రెట్లు ఎక్కువని NICT తెలిపింది.