జూలై 1 నుంచి 3 వరకు జపాన్ ప్రధాని సనాయే తకైచీ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో జరిగే 16వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పెట్టుబడులు, రక్షణ సహకారం, సెమీకండక్టర్లు, కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, మౌలిక సదుపాయాలు, ఇండో-పసిఫిక్ వ్యూహం వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. చైనా కార్యకలాపాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. జపాన్ ప్రతిపాదించిన 10 ట్రిలియన్ యెన్ పెట్టుబడుల లక్ష్యంపై కూడా సమీక్ష జరిగే అవకాశం ఉంది.