కోలీవుడ్ హీరో జయం రవి-కెనీషా కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరి మెడలో పూల దండలు కనిపించడంతో.. ‘పెళ్లి చేసుకున్నారా?’ అంటూ పలువురు నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే? తన నిర్మాణ సంస్థ ‘రవి మోహన్ స్టూడియోస్’ లోగోను జయం రవి గురువారం SM వేదికగా ఆవిష్కరించారు. ఈ ప్రకటనకు ముందు ఆయన, కెనీషా కలిసి చెన్నైలోని మురుగన్ దేవాలయాన్ని సందర్శించారు.