మైక్రోసాఫ్ట్ సంస్థపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు వేల మంది అమెరికన్ ఉద్యోగులకు లేఆఫ్‌లు ఇచ్చిన తర్వాత 6,300 హెచ్-1బీ వీసాలు పొందిందని ఆరోపించారు. దీనిపై స్పందించిన మైక్రోసాఫ్ట్.. కొత్తగా విదేశీ ఉద్యోగులను నియమించుకోలేదని స్పష్టం చేసింది. ఇప్పటికే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల విధుల్లో మార్పులు చేసినట్లు వివరణ ఇచ్చింది.