జేఈఈ (అడ్వాన్స్‌డ్) 2026 ఫలితాలకు సంబంధించిన క్లౌడ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో లోపం ఉందని, లక్షలాది మంది విద్యార్థుల వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో పడిందంటూ వచ్చిన వార్తలను IIT రూర్కీ ఖండించింది. ఈ అంశంపై సోషల్ మీడియాలో స్పందించిన ఐఐటీ రూర్కీ, ప్రచారంలో ఉన్న కథనాలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేసింది. విద్యార్థుల డేటా భద్రతకు ఎలాంటి ముప్పు లేదని, గోప్యత పరిరక్షణకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు అమల్లో ఉన్నాయని వెల్లడించింది. నిర్ధారణ లేని వార్తలను నమ్మవద్దని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించింది.