నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) JEE మెయిన్ 2026 సెషన్ 1 అభ్యర్థుల కోసం అప్లికేషన్ వివరాలను సరిచేసుకోవడానికి డిసెంబర్ 1 నుండి 2వ తేదీ రాత్రి 11:50 గంటల వరకు కరెక్షన్ విండోను ఓపెన్ చేయనుంది. ఇప్పటికే రిజిస్టర్ చేసిన వారు వివరాలు మార్చుకోవచ్చు. విండో ముగిసిన తర్వాత మార్పులు చేయడం సాధ్యం కాదు. కొన్ని సవరణలకు అదనపు ఫీజు ఉండొచ్చు. మొబైల్, ఇమెయిల్, చిరునామా, ఫోటో మార్చలేరు, కానీ పేరు, తల్లిదండ్రుల పేర్లు సవరించుకోవచ్చు. అవసరమైన మార్పులు చేసి ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.