నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) JEE మెయిన్-2027 పరీక్ష తేదీలను విడుదల చేసింది. ఈ పరీక్ష వచ్చే ఏడాది జనవరి, ఏప్రిల్ నెలల్లో రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. మొదటి సెషన్ జనవరి 22, 23, 24, 28, 29, 30 తేదీలలో జరుగుతుంది. రెండవ సెషన్ తేదీలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ ఏడాది అక్టోబర్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. UGC NET పరీక్ష డిసెంబర్ 14-19 మధ్య జరుగనుంది. CUET(PG) పరీక్షలు 2027లో జనవరి 1-5, 8, 12-20, 24, 25 తేదీలలో నిర్వహిస్తారు.