ప్రపంచ కుబేరుల్లో ఒకరు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మాజీ టీవీ జర్నలిస్ట్ లారెన్ సాంచెజ్‌ను త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. జూన్ చివరి వారంలో ఇటలీలోని వెనిస్‌లో ఈ వివాహ వేడుక జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమైనట్లు సమాచారం. హాలీవుడ్ ప్రముఖులు, బిజినెస్ ప్రముఖులు ఈ పెళ్లికి హాజరవుతారని చెబుతున్నారు. పెళ్లి వేడుక అట్టహాసంగా జరగనుంది.