భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన తండ్రి అనారోగ్యం కారణంగా ఆమె వివాహం వాయిదా పడింది. ఈ నేపథ్యంలో, స్మృతికి మద్దతుగా నిలిచేందుకు ఆమె స్నేహితురాలు, క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్ నుంచి తప్పుకుంది. బ్రిస్బేన్ హీట్ జట్టు ఈ విషయాన్ని వెల్లడించింది. నవంబరు 9న ప్రారంభమైన బిగ్‌బాష్ లీగ్ 11వ సీజన్‌లో జెమీమా బ్రిస్బేన్ హీట్‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది. స్మృతి వివాహం కోసం 10 రోజుల క్రితం భారత్‌కు వచ్చిన జెమీమా, అనివార్య కారణాల వల్ల వేడుకలు నిలిచిపోవడంతో స్మృతి కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించుకుంది.