పద్మనాభస్వామి ఆలయంలో ఆభరణాలు అదృశ్యం

కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ప్రసిద్ధ శ్రీ పద్మనాభస్వామి ఆలయం నుంచి సుమారు 78 గ్రాముల బంగారం, వజ్రాల ఆభరణాలు అదృశ్యమైనట్లు కేరళ డీజీపీ నివేదిక వెల్లడించింది. వైరమ్ నామంగా పిలువబడే వజ్రాల ఆభరణంతో పాటు, ఆరు నెలల కిందట తీసుకెళ్లిన బంగారు దీపం కూడా కనిపించకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆలయ భద్రతా ఏర్పాట్లపై డీజీపీ ఆందోళన వ్యక్తం చేస్తూ, భద్రతను పటిష్ఠం చేయాలని హోం శాఖ సెక్రటరీని కోరారు. విలువైన ఆభరణాలను సురక్షిత ఖజానాలకు తరలించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్