దేశంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీ జియో, ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ.51కే 5G ప్లాన్‌ను అందిస్తోంది. తక్కువ ధరకే 5G వేగాన్ని అనుభవించాలనుకునే వారికి ఇది ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా 3GB అదనపు 4G/5G డేటా లభిస్తుంది. ఇప్పటికే రోజుకు 1.5GB డేటా అందించే, కనీసం ఒక నెల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ కలిగి ఉన్న వినియోగదారులు ఈ రూ.51 యాడ్-ఆన్‌తో అపరిమిత 5Gని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ ప్రస్తుత ప్లాన్ వ్యాలిడిటీకి అనుగుణంగా ఉంటుంది.