జియో, ఎయిర్టెల్ టారిఫ్స్ 15-20% పెంచే అవకాశం?

దేశంలో అతిపెద్ద టెలికం ఆపరేటర్లైన జియో, భారతి ఎయిర్టెల్ తమ కస్టమర్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది 15-20% వరకు రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 5G స్పెక్ట్రమ్ విస్తరణకు చేసిన భారీ పెట్టుబడులను రికవరీ చేసుకోవడంతో పాటు, లాభాలను పెంచుకోవాలనే యోచనలో కంపెనీలు ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే ఎయిర్టెల్ తన రూ.799 ప్లాన్స్ నిలిపివేసింది.

సంబంధిత పోస్ట్