ముగిసిన జియో ఐపీఓ.. 22 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌

రిలయన్స్‌ జియోకు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ ముగిసింది. మూడో రోజు చివరికి 22.19 రెట్ల స్పందన లభించింది. మొత్తం 19.75 కోట్ల షేర్లకు 438 కోట్ల బిడ్లు వచ్చాయి. క్యూఐబీ కోటా 70 రెట్లు, నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల కోటా 14 రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల కోటా 2.72 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి. ఉద్యోగుల కోటాకు 2.93 రెట్లు, రిలయన్స్‌ షేర్‌హోల్డర్ల కేటగిరీకి 7.6 రెట్ల స్పందన వచ్చింది. గ్రే మార్కెట్‌ ప్రీమియం రూ.238గా ఉండగా, షేర్ల కేటాయింపు ఈ నెల 26న, స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్‌ 28న జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕