మెట్రోస్టేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాలు

తెలంగాణ ప్రభుత్వం కీలక నినరియం తీసుకుంది. ట్రాన్స్‌జెండర్లకు అండగా నిలుస్తూ.. వారికి ఉద్యోగ, ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముందుకు వస్తోంది. దీనిలో భాగంగా ఇప్పుడు హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ఈ మేరకు ఇటీవల శిక్షణ పొందిన 20 మంది ట్రాన్స్‌జెండర్ సిబ్బంది సోమవారం విధుల్లోచేరారు. మెట్రోలో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికులు భద్రతను దృష్టిలో ఉంచుకుని.. వారిని సెక్యూరిటీ విభాగంలో విధుల్లోకి తీసుకుంది.

సంబంధిత పోస్ట్