కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా 100 జూనియర్ టెలికాం ఆఫీసర్ (జేటీఓ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గలవారు బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్‌సైట్ bsnl.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ జూన్ 4, 2026, చివరి తేదీ జులై 3, 2026. దరఖాస్తు సవరణలకు జులై 4 నుంచి జులై 11, 2026 వరకు అవకాశం ఉంటుంది. ఈ పోస్టులకు నెలకు రూ. 40 వేల వరకు జీతం ఉంటుంది.