టెన్త్, ఇంటర్ అర్హతతో NGRIలో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని CSIR-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NGRI) సెక్యూరిటీ ఆఫీసర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుకు మాజీ సైనిక ఉద్యోగులు (JCO), MTS పోస్టులకు పదో తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పని అనుభవం ఉన్నవారు అర్హులు. ఎంపిక ప్రక్రియ ట్రేడ్ టెస్ట్ లేదా రాత పరీక్ష ద్వారా జరుగుతుంది. పూర్తి వివరాలకు https://www.ngri.res.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

సంబంధిత పోస్ట్