జాబ్స్ టియర్స్.. కొత్త మిల్లెట్ పంట

జాబ్స్ టియర్స్ అనే మిల్లెట్ పంట మణిపూర్‌కు చెందినది. ఒక్కసారి నాటితే చాలు, మూడుసార్లు ధాన్యం కోసుకోవచ్చు. మొదటి కోత తర్వాత కొద్ది నెలల వ్యవధిలో మరో రెండుసార్లు పంట తీసుకోవచ్చు. మణిపూర్ ప్రాంతంలో సాగవుతోంది. ఇది అన్నంగా వండుకు తినొచ్చు. పశువులకు గ్రాసంగా, దాణాగా పెడతారు. అధిక ప్రోటీన్, తక్కువ కొవ్వుతో ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కరువుకాలంలో కూడా బతికే ఈ పంట హెక్టారుకు 2-4 టన్నుల దిగుబడిని ఇస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్