లార్డ్స్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ హాఫ్ సెంచరీ సాధించారు. జో రూట్ 102 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. నితీశ్ రెడ్డి వేసిన 46 ఓవర్‌లో ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. అంతేకాదు ఈ ఇన్నింగ్స్‌తో రూట్ టెస్టుల్లో భారత్‌పై 3 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. కాగా, 46 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోరు 142/2. ఓలీ పోప్ (35), జో రూట్ (52) పరుగులతో ఉన్నారు.