డ్యాన్సర్స్ యూనియన్ వ్యవహారాల్లో ఫెడరేషన్ జోక్యం చేసుకోవద్దని జానీ మాస్టర్ లేఖ రాశారు. అవినీతి ఆరోపణలపై పలువురిపై చర్యలు తీసుకున్నామని, అవినీతిపరులను ఫెడరేషన్ కాపాడుతోందని ఆయన ఆరోపించారు. అసోసియేషన్ చీఫ్ సుమలత వేధింపులకు గురవుతున్నారని, నిర్మాతల శ్రేయస్సు కోసమే తాము పోరాడుతున్నామని తెలిపారు. ఉపఎన్నికలు నిర్వహించాలని జనరల్ బాడీ తీర్మానించింది.