TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు. ఇవాళ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలోని రెహమత్ నగర్ డివిజన్ లో పర్యటించారు. ఈ సదర్భంగా మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ మైనారిటీ యువనేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో పార్టీలో చేరిన వారికి మంత్రి పొంగులేటి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడతూ.. పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదన్నారు.