శొంఠితో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, సోడియం, విటమిన్లు ఎ, సి, జింక్, ఫోలేట్, కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. జలుబు చేసినప్పుడు శొంఠి పొడిని నీళ్లలో కలిపి మరగబెట్టి తాగితే ఉపశమనం కలిగిస్తుంది. ఇంకా శొంఠిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాకుండా కడుపులో గ్యాస్, బ్లోటింగ్ వంటి సమస్యలు దూరమవుతాయి. కీళ్ల నొప్పులు దూరమవుతాయి.