కోట శ్రీనివాస్ రావు మృతికి సంతాపం తెలిపిన జూ. ఎన్టీఆర్

విలక్షణ నటుడు కోట శ్రీనివాస్ రావు ఆదివారం ఉదయం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు. ఇక ఇప్పటికే ఈయన మృతికి తెలుగు ఇండస్ట్రీ పెద్దలు, రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. చిరంజీవి, వెంకటేష్, రానా, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బ్రహ్మానందం, బాబు మోహన్, అనిల్ రావిపూడి తదితరులు సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్