రాజకీయల్లోకి జూ.ఎన్టీఆర్ ఎంట్రీ.. లోకేష్ స్పందన అదే!

AP: పల్నాడు జిల్లా పర్యటనలో మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీపై ఆయన మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని లోకేష్ తెలిపారు. అయితే ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ ఇష్టమేనని, ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే ఆహ్వానం ఖాయమని లోకేష్ స్పష్టం చేశారు. కాగా, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజకీయాలపై దృష్టి సారించడం లేదని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్