జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్.. ఏప్రిల్ 1 నుండి కార్ల ధరలు 2% పెంపు

ఏప్రిల్ 1 నుంచి తమ ఉత్పత్తుల ధరలను 2 శాతం పెంచుతున్నట్లు జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ప్రకటించింది. పెరుగుతున్న ముడిసరుకు ఖర్చులను భర్తీ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ధరల పెంపుతో కామెట్ ఈవీ, జెడ్ఎస్ ఈవీ, ఆస్టర్, హెక్టర్, విండ్సర్ ఈవీ మోడళ్ల ధరలు పెరుగుతాయి. అయితే, ఎంజీ ఎం9 ప్రెసిడెన్షియల్ లిమో, ఎంజీ సైబర్‌స్టర్‌ ధరలు యథాతథంగా ఉంటాయి. కొత్త ధరల వివరాల కోసం ఎంజీ డీలర్‌షిప్‌లను లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్