TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మహ్మద్ అజహరుద్దీన్ వైపు పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దీనికి ఇటీవల మంత్రి పొన్నం స్థానిక వ్యక్తికే టికెట్ కేటాయింపు ఉంటుందన్న వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. మరోవైపు ఈ సీటు కోసం స్థానిక నేత నవీన్ యాదవ్ పోటీ పడుతున్నారు.