జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, కూతురిపై కేసు నమోదు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత, ఆమె కూతురు మాగంటి అక్షరపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం వెంకటగిరిలో నమాజ్ కోసం వెళ్తున్న ప్రజలను ఓటు వేయడానికి ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మాగంటి సునీతను A1గా, మాగంటి అక్షరను A2గా పేర్కొంటూ మరి కొంత మందిని ఈ కేసులో చేర్చుతూ దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్