రాష్ట్రంలో అభివృద్ధిని చూసి తీర్పు ఇవ్వండి: CM రేవంత్

TG: మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్‌ రెడ్డి ఇవాళ నల్గొండ జిల్లా గూడూరులో పర్యటించారు. ఇక్కడ నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. 'మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలి. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి తీర్పు ఇవ్వాలి. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురే లేదు.. మా విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు. రేషన్‌ కార్డుల కోసం గతంతో పదేళ్లపాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్రంలో 3.17 కోట్ల మందికి ఒక్కొక్కరి 6 కిలోల సన్నబియ్యం ఇస్తున్నాం' అని అన్నారు.

సంబంధిత పోస్ట్